హీరో నవీన్ పొలిశెట్టి పెళ్లి రిసెప్షన్.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-31 07:05:13  IST  )

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ల్ లెవల్‌లో దూసుకుపోతున్నాయి.

హీరో నవీన్ పొలిశెట్టి పెళ్లి రిసెప్షన్.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్‌లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ పేరుతో మీడియా మిత్రులతో సంభాషించారు. తమ మూవీని జనాల్లోకి వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడినన హీరో నవీన్ పొలిశెట్టి.. ‘ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఆద్యంతం వినోద భరితంగా ఉంటుంది. ఇంత మంచి సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తేనే బాగుంటుందని నిర్మాతలు భావించారు. అందుకే పండుగకు వచ్చేస్తున్నాం. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. సంక్రాంతికి హీరోల సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన వాడినే. అలాంటి కథానాయకుల సినిమాలతో నా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప స్థాయికి చేర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. తప్పకుండా ‘అనగనగా ఒకరాజు’ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చూసి ఎంజాయ్ చేయండి’ అని కోరాడు. ఇది తన మూడో సంక్రాంతి చిత్రమని.. మీరు ఈ మూవీపై చూపించబోయే ప్రేమ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది హీరోయిన్ మీనాక్షి చౌదరి.

Next Story