- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌కి ఊహించని షాక్.. IMDb టాప్-10 సినిమాల్లో దక్కని అవకాశం!
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనేవారు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనేవారు. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటిది.. నార్త్ ఇండియా ప్రేక్షకులు సైతం టాలీవుడ్ సినిమాల విడుదల కోసం ఎదురుచూసే స్థితికి వచ్చారు. ఇందుకు బహుబలి మూవీ పునాదులు వేస్తే.. ఆర్‌ఆర్‌ఆర్ ఆ ఊపును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఆస్కార్ గెలిచి హైదరాబాద్ నుంచి హాలీవుడ్ వరకు టాలీవుడ్ ప్రయాణాన్ని సంచలనంగా మార్చింది. కానీ, ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇంట్లోనే గెలువలేకపోయిందా? అనే సందేహాన్ని కలిగిస్తోంది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ విడుదల చేసిన ఈ ఏడాది తొలి ఆరు నెలల టాప్ 10 ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాలో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
జనవరి 1 నుంచి జులై 1 మధ్య ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చిన సినిమాల జాబితా:
చావా (హిందీ)
డ్రాగన్ (తమిళ్)
దేవా (హిందీ)
రైడ్ (హిందీ)
రెట్రో (తమిళ్)
ది డిప్లొమాట్ (హిందీ)
ఎల్2 ఎంపురాన్ (మళయాళం)
సితారే జమీన్ పర్ (హిందీ)
కేసరి చాప్టర్ 2 (హిందీ)
విదాముయర్చి (తమిళ్)
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. అందులో "సంక్రాతికి వస్తున్నాం", "మ్యాడ్ స్క్వేర్", "సింగిల్", "శుభం", "కోర్టు", "కుబేర", "ఢాకూ మహారాజ్", "తండేల్" లాంటి సినిమాలు వాణిజ్యంగా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ అవి IMDb టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు IMDbలో మంచి రేటింగ్ తెచ్చుకోవడం, ఈ సంస్థ రేటింగ్స్‌పై ప్రశ్నలు తీసుకొస్తోంది.






