- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటుడిగా శంకర్‌కు ఆఫర్?
'తలైవార్ 173' చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం శంకర్‌ను అనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో 'తలైవార్ 173' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో విజయాలను అందుకొని ఇండియాలోనే టాప్ దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన శంకర్‌ను ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం సిబి చక్రవర్తి సంప్రదించినట్లు, ఆయనతో ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అన్ని ఓకే అయితే ఈ సినిమాలో కీలకమైన పాత్రలో శంకర్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే ఇందులో శంకర్ భాగం అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






