Sharwanand: ఉగాది కానుకగా శర్వానంద్ 38వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Sharwanand: ఉగాది కానుకగా శర్వానంద్ 38వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ‘మనమే’ తో రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీనిని ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శర్వానంద్ 38వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉగాది కానుకగా రాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. టైటిల్ రివీల్ చేస్తారా లేక ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story