Amulya Gowda: సీరియల్‌లో చీరకట్టు అమాయకపు లుక్స్.. బయట అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న బ్యూటీ

by Pulgam srinivas |

సీరియల్‌లో చీరకట్టు అమాయకపు లుక్స్.. బయట అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న బ్యూటీ అమూల్య గౌడ

Amulya Gowda: సీరియల్‌లో చీరకట్టు అమాయకపు లుక్స్.. బయట అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే, సీరియల్ హీరోయిన్లకు పెద్ద స్థాయిలో గుర్తింపు ఉండేది కాదు. దాంతో సీరియల్స్‌లో నటించడానికి కూడా పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సీరియల్స్‌లో నటించడానికి చాలామంది క్యూ కడుతున్నారు.




అందుకు ప్రధాన కారణం సీరియల్స్ చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరగడం. అలాగే వాటి ద్వారా మంచి గుర్తింపు పొందిన వారికి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా అవకాశాలు వస్తుండడంతో చాలామంది ఆ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సీరియల్స్‌లో చాలా పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించే కొంతమంది హీరోయిన్లు బయట మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు.




అలాంటి వారిలో 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ బ్యూటీ మీనా అలియాస్ అమూల్య గౌడ ఒకరు. ఈమె సీరియల్స్‌లో ఎక్కువగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకుంది. అలాగే తన సహజమైన నటనతో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.




సీరియల్స్‌లో పద్ధతి గల వస్త్రధారణతో ఆకట్టుకునే ఈమె, బయట మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈమె, ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన స్టైలిష్ మరియు గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. దాంతో ఈమె ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.

Next Story