అభిషేక్ నటనపై అమితాబ్ ఆనందం..

by Taduka Kalyani |   (  Updated:2025-07-06 16:00:07  IST  )

తాజా సినిమా ‘కాళీధర్ లపటా’ లో కుమారుడు అభిషేక్ బచ్చన్ నటనకు విస్తృత స్థాయిలో ప్రశంసలు లభిస్తుండటంతో తాను ఒక గర్వపడే తండ్రిలా ఫీల్ అవుతున్నట్లు అమితాబ్ బచ్చన్ తెలిపారు.

అభిషేక్ నటనపై అమితాబ్ ఆనందం..
X

దిశ, వెబ్ సైట్: తాజా సినిమా ‘కాళీధర్ లపటా’ లో కుమారుడు అభిషేక్ బచ్చన్ నటనకు విస్తృత స్థాయిలో ప్రశంసలు లభిస్తుండటంతో తాను ఒక గర్వపడే తండ్రిలా ఫీల్ అవుతున్నట్లు అమితాబ్ బచ్చన్ తెలిపారు. తన ‘ఎక్స్’ ఖాతాలో అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని పంచుకున్నారు. దర్శకుడు, సన్నిహిత స్నేహితుడు టిన్ను ఆనంద్ అభిషేక్ బచ్చన్ నటనపై ఇచ్చిన సమీక్షను షేర్ చేస్తూ, అది తన మనసును గర్వంతో నింపిందని చెప్పారు. “T 5433 – నా స్నేహితుడు, డైరెక్టర్ అయిన టిన్ను ఆనంద్ గారు ఇలా మెసేజ్ పంపితే, అది మాటల కంటే ఎక్కువని చెబుతోంది. ఆయనకు నా కృతజ్ఞతలు” అని అమితాబ్ పోస్ట్ చేశారు. టిన్ను ఆనంద్ ఇచ్చిన మెసేజ్‌ను కూడా షేర్ చేస్తూ,

“సర్ జీ,

నా దగ్గర అభిషేక్ ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల, దయచేసి అతనికి నా తరఫున అభినందనలు చెప్పగలరా. ‘కాళీధర్ లపటా’ లో అతను అద్భుతంగా నటించాడు.” అని టిన్ను ఆనంద్ అభిషేక్ నటనపై ప్రశంసలు తెలిపినట్లు అమితాబ్ పేర్కొన్నారు.

Next Story