- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్పిటల్‌లో అమితాబ్ బచ్చన్.. ఆందోళన చెందుతున్న అభిమానులు.. అసలేం జరిగిందంటే?
ముంబయ్‌లోని ప్రముఖ నానావతి ఆసుపత్రిలో అమితాబ్ చేరారని సమాచారం రావడంతో.. ఈ విషయం తెలుసుకున్న కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన ముంబయ్‌లోని ప్రముఖ నానావతి ఆసుపత్రిలో చేరారని సమాచారం రావడంతో.. ఈ విషయం తెలుసుకున్న కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఏమైందో అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, పుకార్లకు చెక్ పెడుతూ అమితాబ్ బచ్చన్ టీమ్ వెంటనే స్పందించి అసలు విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. మే 16వ తేదీ శనివారం నాడు అమితాబ్ బచ్చన్ గారు ఆసుపత్రికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే అది ఎలాంటి అత్యవసర పరిస్థితి కాదని.. కేవలం ఆయన రెగ్యులర్ రోటీన్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లారని స్పష్టం చేసింది. హాస్పిటల్‌లో సాధారణ పరీక్షలు అన్నీ పూర్తయిన వెంటనే వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా బాగుందని వైద్యులు కూడా వెల్లడించారు.
అంతేకాకుండా, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే బిగ్‌బీ ముంబయ్‌లోని తన నివాసం జల్సా నుండి జనక్ ఆఫీస్‌కు తన కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. మరోవైపు స్వయంగా అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ప్రార్థనలు.. ఇంకా మరెన్నో అంటూ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ గారు కుర్ర హీరోలకు పోటీగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం నిజంగా విశేషం. రీసెంట్‌గా భారీ సక్సెస్ అందుకున్న ‘కల్కి’ సినిమా సీక్వెల్ అయిన ‘కల్కి-2’ లో ఆయన నటిస్తున్నారు.






