Keerthy Suresh: అద్భుత నటి కీర్తి సురేష్ చిన్ననాటి క్యూట్ ఫొటో వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-03-11 13:20:14  IST  )

నేను శైలజ (Nenu shailaja) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh).

Keerthy Suresh: అద్భుత నటి కీర్తి సురేష్ చిన్ననాటి క్యూట్ ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేను శైలజ (Nenu shailaja) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అద్భుత నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్, అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకుంది. సినీ పరిశ్రమలో అలాగే తెలుగు ప్రజల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది.

ఏకంగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిత్రంలోనే నటించే చాన్స్ దక్కించుకుంది. మెగాస్టార్‌కు చెల్లెలిగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే సీనియర్ స్టార్ హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth)కు సోదరిగా కూడా నటించి జనాలకు కన్నీళ్లు తెప్పించింది. వీటితో పాటుగా నేను లోకల్ (Nenu lokal), మిస్ ఇండియా (Miss India), మహానటి, రంగ్ దే (Rang dhe)వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతంగా నటించింది.

ఇటు టాలీవుడ్‌లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడితో తెరకెక్కిన బేబీ జాన్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే మరోవైపు ప్రియుడు ఆంటోని (Antony)ని పెళ్లాడింది. ఇరు కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది.

ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలోని ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే కీర్తి సురేష్ తన అక్క పుట్టిన రోజు సంద్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తన అక్కతో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంది.

ఈ పిక్స్‌కు కీర్తి సురేష్ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క (రేవతి సురేష్). నా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నా గోడలా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా పక్కన ఉంటే జీవితం కేవలం ఒక చిన్న నడక లాంటిది. నువ్వు బహుశా నాకు ఇష్టమైన తోబుట్టువు కావచ్చు. ఐ లవ్ యు 3000’’ అంటూ చివర్లో లవ్ సింబల్ జోడించింది.

అయితే అంతా బాగానే ఉంది కానీ.. తన అక్కతో కలిసి పంచుకున్న ఫొటోల్లో కీర్తి సురేష్ చిన్న నాటి ఫొటో కూడా పంచుకుంది. ఇందులో మహానటి నాలుక బయటపెట్టి ఇతరులను భయపెడుతున్నట్లు.. చిలిపి ఫోజులతో ఫొటోకు అక్కాచెల్లెళ్లు ఇద్దరు స్టిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కీర్తి సురేష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story