- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పుకోలేని పాపాలు చేశా.. ఇప్పుడు అనుభవిస్తున్నా.. దుమారం రేపుతున్న అమర్ దీప్ కామెంట్స్..
సీరియల్ హీరో అమర్ దీప్ బుల్లితెరపై భారీగా సక్సెస్ అయ్యాడు. పలు రియాలిటీ షోస్‌లోనూ కనిపించి.. మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే సుప్రీతతో కలిసి హీరోగా మూవీ కంప్లీట్ చేసిన ఆయన..

దిశ, వెబ్ డెస్క్ : సీరియల్ హీరో అమర్ దీప్ బుల్లితెరపై భారీగా సక్సెస్ అయ్యాడు. పలు రియాలిటీ షోస్‌లోనూ కనిపించి.. మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే సుప్రీతతో కలిసి హీరోగా మూవీ కంప్లీట్ చేసిన ఆయన.. మరో ఫిల్మ్ కూడా కమిట్ అయినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయని తెలిపాడు. అయితే జీవితం గురించి కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడిన అమర్.. తన భార్య తేజస్వితో విడాకుల గురించి మాట్లాడాడు. తామిద్దరం అందరిలా షో చేయం కాబట్టి ఇలాంటి పుకార్లు వస్తున్నాయన్నాడు.
ఇక జీవితంలో చిన్నతనంలోనే చాలా అనుభవించానని.. సొంత స్నేహితులు కూడా వెన్నుపోటు పొడిశారని.. ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందే మోసం చేసిందని తెలిపాడు. తాను కూడా గతంలో చాలా తప్పులు చేశానని.. కర్మ హిట్ బ్యాక్ చేసిందేమో.. ఇప్పుడు అనుభవిస్తున్నానని బాధపడ్డాడు. పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తెలిపాడు.






