- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajkumar Periyaswamy: ఆయన వల్లే కల నెరవేరింది.. మాటలు రావడం లేదంటూ అమరన్ డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) కలిసి నటించిన చిత్రం ‘అమరన్’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) కలిసి నటించిన చిత్రం ‘అమరన్’. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి(Rajkumar Periyaswamy) దర్శకత్వం వహించారు. అయితే దీనిని ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా గత ఏడాది దీపావళి కానుకగా థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా రియల్ స్టోరీగా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇంత వరకు వంద కోట్ల హీరోగానే శివ కార్తికేయన్ పేరు సంపాదించుకున్నాడు. కానీ అమరన్ మూవీ మూడు వందల కోట్లకు పైగానే రాబట్టింది.
అలా అమరన్ సినిమా కోలీవుడ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అమరన్ మూవీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘అమరన్‌కి 100 రోజులు పూర్తి అయింది. మణి సార్, నేను సినిమాల గురించి కలలు కనడానికి, సినిమా నిర్మాణం పట్ల ఆకర్షితులవడానికి కారణం మీరే. దీన్ని మీతో తీయడానికి నాకు రెండు దశాబ్దాలు, రెండు సినిమాలు పట్టింది. మీ పోస్టర్‌లను చూసి స్ఫూర్తి పొందడం నుంచి, మీ పక్కన నిలబడటం వరకు, నేను మాట్లాడకుండా ఉండిపోయాను. మీ వల్లే నా కల నెరవేరింది. అమరన్ కోసం మీ అందరూ చేసిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మణిరత్నం గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Towards #100DaysOfAmaran
— Rajkumar Periasamy (@Rajkumar_KP) February 4, 2025
Mani sir, you were the reason for me to dream about films and be fascinated with filmmaking; you were the first person I ever wanted to take a picture with and took it in 2005! To my heartbreak, I lost it as well.
Took me two decades and two films to… pic.twitter.com/la6kNmWcF1






