‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2026-05-06 17:20:09  IST  )

‘అమరం’ చిత్రంతో తేజేష్ రాజన్ అనే కొత్త నటుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్
X

దిశ, సినిమా: ‘అమరం’ చిత్రంతో తేజేష్ రాజన్ అనే కొత్త నటుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్స్ యాక్షన్‌తో ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ట్రైబల్ స్మగ్లర్‌, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది. వెస్ట్రన్ ఘాట్స్‌లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. లోతైన ప్రేమకథను సిట్యువేషనల్ యాక్షన్‌తో మేళవించి చిత్రాన్ని రూపొందించారు. తేజేష్ తొలి సినిమాకే అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. కాగా.. హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించగా, నాగినీడు, సాయి ధీనా, జార్జ్ మరియన్, సురేష్ చంద్ర మీనన్, హరీష్ పరాడి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Read more..షౌటింగ్ సూన్.. స్పెషల్ పోస్టర్‌తో నారా రోహిత్ కొత్త సినిమా అప్డేట్

Next Story