మిల్లెట్లను ఉత్తమ ఆహారంగా ప్రచారం చేసే లెట్ సి లాంచ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉంది: అమల

by Kodari Anjali |

అక్కినేని నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

మిల్లెట్లను ఉత్తమ ఆహారంగా ప్రచారం చేసే లెట్ సి లాంచ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉంది: అమల
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె టాలీవుడ్ నటిగా పలు చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం దక్కించుకుంది. రాజేందర్ దర్శకత్వంవహించిన మిథిలి యెన్నై కదలి అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఇచ్చింది అమల. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అలాగే నాగార్జున అండ్ అమల నిర్ణయం, శివ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఈ మూవీస్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖ కథానాయకులతో నటించిది. ఆర్జీవీ అండ్ మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్లతో కూడా కలిసి పని చేసింది. అలాగే అమల జంతు సంక్షేమ కార్యకర్త కూడా. ఇకపోతే అమల తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది.

‘‘తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యవస్థాపకుల నెట్‌వర్క్ ద్వారా మిల్లెట్‌లను ఉత్తమ ఆహారంగా ప్రచారం చేసే లెట్ సి లాంచ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉంది. HNA కౌన్సిల్ నుంచి శ్రీ శ్రీనివాస్, అతని వైద్యుల బృందం నిర్వహించారు. జాతీయ మీడియా పోర్టల్ అయిన Millets.news ద్వారా ఆధారితం. మంచి ఆరోగ్యం, జీవనోపాధి కోసం అద్భుతమైన చొరవకు అభినందనలు’’. అంటూ అమల పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Next Story