Allu Ayan: ఆర్సీబీ విజయంపై అల్లు అయాన్ ఎమోషనల్.. వీడియో పంచుకున్న బన్నీ

by Kodari Anjali |   (  Updated:2025-06-04 09:56:35  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్సీబీ టైటిల్ వీడియోలే కనిపిస్తున్నాయి.

Allu Ayan: ఆర్సీబీ విజయంపై అల్లు అయాన్ ఎమోషనల్.. వీడియో పంచుకున్న బన్నీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్సీబీ టైటిల్ వీడియోలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ విజయంపై వరుస పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఏకంగా 18 సంవత్సరాల కల నెరవేరడంతో.. ఫైనల్ మ్యాచులో పంజాబ్‌ను చిత్తు చేసి మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంతో అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు. ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ప్రస్తుతం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ విజయంపై సోషల్ మీడియా వేదికన అంతా పోస్టుల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ విన్ అవ్వడంతో ఈ సంతోషంలో అయాన్ టీవీ ముందే బాటిల్‌లోని వాటర్ తలపై పోసుకున్నాడు.

అలాగే నేలపై పడుకుని ఎంజాయ్ చేశాడు. తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని.. ఈ కారణంగానే క్రికెట్ పై అభిమానం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సారి కప్ లాలీ పప్ అని చెప్పలేదని ఫన్నీగా ఓ కామెంట్ కూడా చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో తండ్రి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ కూడా ఇన్‌స్టా స్టోరీలో ‘వెయిటింగ్ ఈస్ ఓవర్. ఈ సాలా కప్ నమ్దూ.. 18 ఏళ్లుగా ఈ రోజుగా వెయిట్ చేశాం. ఆర్జీబీకి అభినందనలు’ అంటూ బన్నీ రాసుకొచ్చారు.

Next Story