- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: ప్రత్యేక పూజలు చేసిన అల్లు అర్జున్ భార్య, కూతురు .. కారణం ఏంటంటే? (వీడియో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) సినిమాల్లో నటించినప్పటికీ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) సినిమాల్లో నటించినప్పటికీ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఆయన కూతురు చిన్నప్పుడే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘యశోద’ మూవీలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఐకాన్ స్టార్ భార్య స్నేహరెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అలాగే తన పిల్లలు అర్హ, అయాన్‌లకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది.
అలాగే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే వారితో ముచ్చటిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్ భార్య, కూతురు అర్హ ఇంట్లో రథసప్తమి పూజను గ్రాండ్‌గా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక అవి చూసి వారు అర్హ చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఈ పూజలు అల్లు అర్జున్ కోసమే చేశారని చర్చించుకుంటున్నారు.
కాగా, గత కొద్ది రోజుల నుంచి ఐకాన్ స్టార్ వివాదం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సమయంలో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తొక్కిసలాట బన్నీ రావడం వల్లే జరిగిందని ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అలాగే గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఆయన వల్ల ఒక ప్రాణం పోయిందని అంటున్నారు. కానీ ‘పుష్ప-2’మూవీ టీమ్ మాత్రం మృతి చెందిన మహిళ కొడుకుక్కి చికిత్స చేయిస్తున్నారు. ఇక ఈ చిక్కులన్నీ తొలగిపోవాలనే స్నేహ పూజలు చేస్తుందని తెలుస్తోంది.
Read Also..
Shah Rukh Khan: దయచేసి వారికి సపోర్ట్ చేయండి.. అభిమానులకు షారుఖ్ ఖాన్ రిక్వెస్ట్ (వీడియో)






