మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం కోలాహలంగా జరిగింది.

మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా హాజరై, అభిమానులతో ముచ్చటించారు. ఇక ఫ్యాన్స్ మీట్ అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా.. ‘నా ప్రియమైన అభిమానులారా... ఈ కార్యక్రమం కోసం మీరు వివిధ ప్రాంతాల నుండి తరలిరావడం చూస్తుంటే నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీ ఆదరణకు నేను ఎంతో కృతజ్ఞుడను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా’ అంటూ ఫ్యాన్స్ దిగిన సెల్ఫీ షేర్ చేశాడు అల్లు అర్జున్. కాగా.. ఫ్యాన్స్ మీట్ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివిటీ, అనవసరపు వివాదాలపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో సాగే దుష్ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవద్దు. మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్‌గా వాళ్లను వదిలేయండి. అంతేకానీ పదే పదే వాళ్లను ట్రోల్ చేయడం, వాళ్లపై ద్వేషాన్ని పెంచుకోవడం వంటివి ఏమాత్రం మంచిది కాదు.. ఎందుకంటే మీ శ్రమ, సమయం చాలా విలువైనవి. మీ ప్రతి రోజూ ఎనర్జీని మీ ఎదుగుదల కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలకు సమయాన్ని కేటాయించకండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story