- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజాస్టర్ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)... రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప సినిమా (Pushpa ) తీయడంతో

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)... రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప సినిమా (Pushpa ) తీయడంతో... అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా అంతర్జాతీయంగా పాపులర్ అయిపోయింది. పార్ట్ వన్, రెండో పార్ట్ 2 సక్సెస్ కావడంతో పాటు... హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ స్థాయి... అమాంతం పెరిగిపోయింది.
అలాంటి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాలను.. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో (Trivikram) చేయాల్సిన సినిమాను పక్కకు పెట్టి... అట్లీతో (atlee)ముందుకు వెళ్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా ఉంటుందని కూడా.. జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయకుండా మరో కొత్త దర్శకుడితో.. అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఊహించని... దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారట. అయితే ఆ దర్శకుడు... ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంత మంది అల్లు అర్జున్ అంటే పడని వారు.... మెహర్ రమేష్ తో ఇవ్వబోతున్నాడని... సెటైర్లు పేల్చుతున్నారు.






