Allu Arjun: 21ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ఆర్య’ సినిమా.. అల్లు అర్జు్న్ ట్వీట్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-05-07 11:26:15  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో బెగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి.

Allu Arjun: 21ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ఆర్య’ సినిమా.. అల్లు అర్జు్న్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో బెగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌నే ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. ఇందులో అల్లు అర్జున్ హీరోగా అనురాధ మెహతా(Anuradha Mehta) హీరోయిన్‌గా నటించగా.. శివ బాలాజి ప్రధాన పాత్రలో మెప్పించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే.. 2004 విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నేటికి 21 ఏళ్లు పూర్తి చేసుకోగా.. అప్పటి మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఓ ట్వీట్ షేర్ చేశాడు.

‘ఆర్య కేవలం సినిమా కాదు.. అది నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ప్రయాణానికి నాంది. ప్రేమ, జ్ఞాపకాలు అండ్ ఇప్పటికీ జీవించి ఉన్న మాయాజాలానికి కృతజ్ఞతలు.. ఆర్యకు 21 ఏళ్లు పూర్తి అయ్యాయి’ అంటూ ఫొటోస్ షేర్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇలాంటి లవ్ స్టోరీ మరొకటి ప్లాన్ చెయ్యి అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. అయితే.. ఆర్యకు సీక్వెల్‌గా ‘ఆర్య-2’ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

Next Story