- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
4000 చదరపు గజాల్లో అల్లు అర్జున్ డ్రీమ్ హౌస్.. ఖర్చు అన్ని కోట్లు
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ లో 4000 చదరపు గజాల విస్తీర్ణంలో, దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో అల్లు అర్జున్ ఓ భారీ ఇంటిని నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ శాతం ముంబైలో జరుగుతుండడంతో ప్రయాణాల వల్ల సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ముంబైకి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించేందుకు అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చాలా దగ్గర్లో అల్లు అర్జున్ ఒక ఖరీదైన ఇంటిని నిర్మించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఏకంగా నాలుగు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఓ భారీ మెన్షన్ నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీని నిర్మాణ వ్యయం దాదాపు 80 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.






