‘కరుప్పు’ ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధం మూవీ టీమ్

by Pulgam srinivas |

'కరుప్పు' ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

‘కరుప్పు’ ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధం మూవీ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఈ సినిమాను మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, తాజాగా మూవీ బృందం ఆడియో లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 26వ తేదీన మధురై లోని సోలమలై పాలిటెక్నిక్ కాలేజ్‌లో నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణియం (నట్టి), స్వాసిక, శివాడ, సుప్రీత్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు మరియు ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Next Story