- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగతుర్తి కాంగ్రెస్ వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి..
రోజురోజుకు వర్గ విభేదాలతో మండుతున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీపై అధిష్టానం సృష్టి సాధించింది.

దిశ, తుంగతుర్తి: రోజురోజుకు వర్గ విభేదాలతో మండుతున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీపై అధిష్టానం సృష్టి సాధించింది. సమస్యలను పరిష్కరించేందుకుగాను పార్టీ అధిష్టానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియమించింది. నియోజకవర్గంలోని మోత్కూర్, తిరుమలగిరి, అడ్డగూడూరు, శాలిగౌరారం, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు చెందిన నాయకులతో జగ్గారెడ్డి సమావేశమై పరిస్థితులను తెలుసుకోనున్నారు. అయితే ఇప్పటికే మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం వందలాది మంది క్యాడర్‌తో గాంధీభవన్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఒక వినతి పత్రం సమర్పించి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మందుల సామెల్ వైఖరిని ఎండబెట్టింది. జరిగిన విషయాన్ని అందుబాటులోకి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి పరిస్థితిని వివరించారు.






