అల్లు అర్జున్ ‘AA-23’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు (ట్వీట్)

by Mallepaka Hamsa |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

అల్లు అర్జున్ ‘AA-23’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..  వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు (ట్వీట్)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్స్‌లోకి వచ్చి భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో అభిమానుల్లో ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అట్లీ(Atlee), అల్లు అర్జున్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు సమాచారం. ‘AA-23’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే దీనిని సన్ పిక్చర్స్, కళానిధి మారన్(Kalanidhi Maran) ప్రజెంట్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు టాక్. జాన్వీతో పాటు ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ‘AA-23’ అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

‘AA-23’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఈ చిత్రం స్టోరీ అంతా అట్లీ ఆయనకు చెప్పగా.. సల్లూ బాయ్‌కి కథ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్ సూపర్ ఈ కాంబో అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story