- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఆలోచన నీ సంరక్షక దేవదూతగా ఉండుగాక అంటూ హాట్ ఫొటోస్ షేర్ చేసిన అల్లు అర్జున్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది.
ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో నా ఆలోచన నీ సంరక్షక దేవదూతగా ఉండుగాక అనే క్యాప్షన్ జోడించి హాట్ ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






