- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శారీలో కిల్లింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ.. మళ్లీ సినిమాలు చేయాలంటూ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హన్సిక(Hanshika) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక అదే పాపులారిటీతో హీరోయిన్‌గా చాన్స్ వచ్చింది. అలా అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘దేశముదురు’(Desamuduru) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తన ఫస్ట్ మూవీతోనే విజయం సాధించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస చిత్రాల్లో నటిస్తూ మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లలేకపోయింది. దీంతో సినిమాలకు చెక్ పెట్టి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.
కానీ సినిమాల్లో మాత్రం నటించడం లేదు. అయితే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హన్సిక ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో శారీలో స్టన్నింగ్ లుక్స్‌లో సూపర్ అనిపించింది. అలాగే తన కిల్లింగ్ స్టిల్స్‌తో అదరహో అనిపిస్తుంది. ఇక వీటికి ‘హాయ్’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. అది చూసిన నెటిజన్లు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






