- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లెపూలతో సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ బ్యూటీ.. వావ్, సూపర్ అంటూ నెట్టింట ప్రశంసలు
స్టార్ హీరోయిన్ హన్సిక(Hansika) అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగు తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక(Hansika) అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగు తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) సరసన ‘దేశముదురు’ (Desamuduru) సినిమాలో నటించి అమ్మడు భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక టాలీవుడ్ హీరోలు రామ్ పోతినేని, ఎన్టీఆర్, గోపీచంద్(Gopichand), ప్రభాస్(Prabhas), సందీప్ కిషన్, రవితేజ వంటి వారితో నటించిన ఆమె స్టార్ హీరోయిన్‌గా కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో రాణించింది.
ఇక ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడి స్టార్ హీరోలు, సూర్య, దళపతి విజయ్(Thalapathi Vijay), సిద్ధార్థ్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi), శింబులతో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక వరుస సినిమాలతో కెరీర్ పీక్స్ ఉండగానే.. ఆమె పెళ్లి చేసుకుని కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ ‘మహా’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక గత ఏడాది ఆమె ‘105’ సినిమాతో ప్రేక్షకుల అలరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఆమె వరుస ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. తన అందంతో అందరినీ మంద్రముగ్దులను చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా, హన్సిక సంప్రదాయ లుక్‌లో ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో మల్లెపూలతో ఆరెంజ్ కలర్ లెహంగా ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్, సూపర్ క్యూట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






