Allu Arjun: అల్లు అర్జున్ ఇచ్చిన సలహా " తండేల్ " కి బాగానే వర్కౌట్ అయిందిగా..!

by Phanindra |

క్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ), సాయిపల్లవి ( Sai Pallavi ) కలిసి న‌టించిన సినిమా " తండేల్ "

Allu Arjun: అల్లు అర్జున్ ఇచ్చిన సలహా  తండేల్  కి బాగానే వర్కౌట్ అయిందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ), సాయిపల్లవి ( Sai Pallavi ) కలిసి న‌టించిన సినిమా " తండేల్ " ( Thandel ) చందు మొండేటి (chandoo mondeti ) డైరెక్షన్ లో ఈ సినిమా తెర‌కెక్కింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ పతాకం పై బ‌న్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు. వరల్డ్ వైడ్ గా ఫిబ్ర‌వ‌రి 7 న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ సూప‌ర్ హిట్ గా నిలిచింది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం తొలి రోజు రూ.21.27 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా మేకర్స్ తెలియజేశారు. కాగా.. ఈ సినిమాలో చైతూ - ప‌ల్ల‌వి కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. అన్నింటికీ మించి దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇదే విష‌యాన్ని నిర్మాత అల్లు అర‌వింద్ ( Allu Aravind) కూడా ఒప్పుకొన్నారు. ఒక‌వేళ దేవీ " తండేల్ " చిత్రానికి సంగీతాన్ని ఇవ్వకపొతే ఈ రేంజ్ లో హిట్ అయ్యేది కాద‌న్నారు.

" తండేల్ " ( Thandel ) హిట్ అవ్వడానికి అల్లుఅర్జున్‌ ( Allu Arjun ) కూడా ఒక కారణం. ఎందుకంటే, బన్నీ సలహా మేరకు దేవీశ్రీ ప్ర‌సాద్‌ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న‌ట్లు అల్లు అర‌వింద్ తెలిపారు. తండేల్ మూవీ షూటింగ్ టైం లో " పుష్ప 2 " సినిమాతో దేవీ శ్రీ బిజీగా ఉండటంతో, మరి తన సమయాన్ని తండేల్‌కు కేటాయించ‌గ‌ల‌డా అనే డౌట్ క‌లిగింద‌ని, దీంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాల‌ని అనుకున్న‌ట్లుగా తెలిపారు. అయితే బ‌న్నీ మాత్రం.. ల‌వ్ స్టోరీలకు దేవీశ్రీ ప్ర‌సాద్ పర్ఫెక్ట్ , బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడని .. చెప్ప‌డంతో ఫైనల్ గా ఒప్పుకున్నానని ఇంటర్వ్యూ లో తెలిపారు.

Next Story