- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sneha Reddy: ఐకాన్‌స్టార్ సతీమణి లేటెస్ట్ పోస్ట్.. ఆకట్టుకుంటోన్న పల్లెటూరి వాతావరణం..?
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సతీమణి స్నేహారెడ్డి (Sneha Reddy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సతీమణి స్నేహారెడ్డి (Sneha Reddy) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. స్నేహా సినిమాల్లో నటించనప్పటికీ.. హీరోయిన్ లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. తరచూ తనకు సంబంధించిన విషయాల్ని, పిల్లలకు సంబంధించినవి సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా స్నేహా రెడ్డి పంచుకునే అర్హ క్యూట్ క్యూట్ వీడియోలు అల్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి.
అయితే స్నేహా ప్రతి రోజూ తను తీసుకునే ఫుడ్, చేసే పనులు, వెకేషన్స్ కు సంబంధించిన విషయాల్ని షేర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. తాజాగా స్నేహా రెడ్డి పల్లెటూరిని సందర్శించినట్లు తెలుస్తోంది. సూర్యుడు అస్తమిస్తోన్న ఫొటోలను, అలాగే ఓ పొలంలోనున్న ఈత చెట్టును స్తోరీలో పెట్టింది. ఈత చెట్టుకు కళ్లు కుండ జనాల్ని మరింత ఆకట్టుకుంటోంది. ఇక పల్లెటూరు అంటేనే పచ్చని పంట పొలాలు, తాటి చెట్లు, ఈత చెట్లు కనిపిస్తుండటం సహజం. కానీ అప్పుడప్పుడే వీక్షించే వారికి మాత్రం ఈ వాతావరణం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్నేహారెడ్డి ఇన్ స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






