Allu Arjun: ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా!

by Ramesh Naini |   (  Updated:2025-05-07 14:37:27  IST  )

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వైరల్ మిమ్స్, సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్‌తో ప్రత్యేక ప్రింటెడ్ టీషర్ట్స్ వస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun: ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వైరల్ మిమ్స్, సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్‌తో ప్రత్యేక ప్రింటెడ్ టీషర్ట్స్ (Printed T-shirts) వస్తున్న విషయం తెలిసిందే. టీషర్ట్స్‌పై నటులు, క్రికెటర్స్, నవ్వించే డైలాగ్స్ లాంటివి రకరకాలవి ప్రింట్‌లు వస్తున్నాయి. ఈ మధ్య చాలా మంది ఇలాంటి ప్రింటెడ్ టీషర్ట్స్ ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలివుడ్‌లో ఫేమస్ అయిన డైలాగ్ ప్రింట్ టీషర్ట్‌తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) కనిపించారు. ముంబాయిలో జరుగుతున్న (Waves Summit 2025) వేవ్స్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు అల్లుఅర్జున్ వెళ్లారు. ఈ సందర్భంగా బన్నీ (Mumbai Airport) ముంబాయి విమానాశ్రయంలో ఉన్న విజువల్స్ బయటకు వచ్చాయి.

ఐకాన్ స్టార్ టీషర్ట్ మీద ఓ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పిన ‘ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా..? (Nellore Peddareddy Taluka) ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే డైలాగ్ ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అలాగే బ్రహ్మానందం ఆ సీన్‌లో నవ్వించే హావభావాల ఫోటోలు ఉన్నాయి. దీంతో ఐకాన్ స్టార్ వేసుకున్న టీ‌షర్ట్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ టీషర్ట్ ధరించడంతో ఎలాగైన కొనుగోలు చేయాలని బన్నీ అభిమానులు ఆన్‌లైన్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే మ్యాడ్ మంకీస్టోర్ వెబ్‌సైట్‌లో ఈ టీషర్ట్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story