ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ కు ఘోర అవమానం.. ఇదిగో వీడియో ?

by velandi.Saikiran |

చెకింగ్ కౌంటర్ దగ్గర అల్లు అర్జున్ ను అధికారి గుర్తుపట్టలేదు. మాస్క్ తీయండి అని దబాయించాడు. దీంతో వెంటనే అర్జున్

ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ కు ఘోర అవమానం.. ఇదిగో వీడియో ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్... ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా ను తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ కు ఘోర అవమానం ఎదురైంది.

ఈ సినిమా షూటింగు కోసం హైదరాబాదు నుంచి గత నెలలో ముంబై వెళ్ళాడు అల్లు అర్జున్. అయితే తన షెడ్యూల్ పూర్తికాగానే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇందులో భాగంగానే నిన్న ముంబై విమానాశ్రయం నుంచి... హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది అల్లు అర్జున్. అయితే ముంబై విమానాశ్రయంలో.. మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్.

ఈ సందర్భంగా చెకింగ్ కౌంటర్ దగ్గర అల్లు అర్జున్ ను సదరు అధికారి గుర్తుపట్టలేదు. మాస్క్ తీయండి అని దబాయించాడు. దీంతో వెంటనే అల్లు అర్జున్ ఆ మాస్క్ తీసి తన ఫేస్ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ ను ఎవరు గుర్తుపట్టడం లేదని... అతని పరువు పోయిందని కొంతమంది నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. దీనికి బన్నీ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మాస్క్ పెట్టుకొని ముంబైలో తిరిగితే ఎలా గుర్తుపడతారని స్పష్టం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

Instagramme Link

Next Story