- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా షారుఖ్ ఖాన్.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
నేషనల్ అవార్డు విన్నర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. షారుఖ్ నుంచి సుక్రితి వరకు ప్రతీ ఒక్కరిని మెన్షన్ చేస్తూ ప్రశంసించాడు. ముందుగా ఉత్తమ నటుడిగా ఎంపికైన షారుఖ్‌కు కంగ్రాట్స్ చెప్పిన బన్ని.. 33ఏళ్ల మీ సక్సెస్‌లో మరో మైలు రాయి

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ అవార్డు విన్నర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. షారుఖ్ నుంచి సుక్రితి వరకు ప్రతీ ఒక్కరిని మెన్షన్ చేస్తూ ప్రశంసించాడు. ముందుగా ఉత్తమ నటుడిగా ఎంపికైన షారుఖ్‌కు కంగ్రాట్స్ చెప్పిన బన్ని.. 33ఏళ్ల మీ సక్సెస్‌లో మరో మైలు రాయి చేరిందని, ఇది సాధ్యమయ్యేలా చేసిన డైరెక్టర్ అట్లీకి థాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత మరో ఉత్తమ నటుడు విక్రాంత్ మాస్సేను కూడా ప్రస్తావించిన ఆయన.. తన ఫేవరేట్ మూవీస్‌లో 12TH FAIL ఒకటని.. విక్రాంత్ డిజర్వ్డ్ అని ప్రశంసించాడు. బెస్ట్ మూవీగా ఎంపికైనందుకు డైరెక్టర్ వినోద్‌తోపాటు ఎంటైర్ టీమ్ కంగ్రాట్స్ చెప్పాడు. ఆ తర్వాత ఉత్తమ నటి రాణి ముఖర్జీని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
ఇక 71వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో తెలుగు ఇండస్ట్రీ వెలిగిపోవడం హ్యాపీగా ఉందన్న అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరి హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి శుభాకాంక్షలు తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ సుక్రితి నేషనల్ అవార్డు అందుకోవడం సెలబ్రేషన్ మూమెంట్ అని.. తన తండ్రి సుకుమార్ గర్విస్తాడని రాసుకొచ్చాడు. ఆ తర్వాత బేబీ టీమ్, హను-మాన్ టీమ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్‌కు కంగ్రాట్స్ చెప్పాడు అల్లు అర్జున్.






