- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్ !
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth

దిశ, వెబ్ డెస్క్ : ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy) అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu arjun ) ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డును ( Gaddar awards) అల్లు అర్జున్ అందుకోబోతున్నారు. పుష్ప సినిమాలో ( Pushpa) అల్లు అర్జున్ నటనను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది.
ఇక ఇవాళ సాయంత్రం.. హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గద్దర్ అవార్డ్స్ అందజేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకకు ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలయ్య, అక్కినేని నాగార్జున అలాగే విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ కి సంబంధించిన మరికొంతమంది హాజరు కాబోతున్నారు. వీళ్ళందరూ సమక్షంలోనే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటారు. ఇది ఇలా ఉండగా... సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత... అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు ఒకరోజు మొత్తం జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఆ తర్వాత... అల్లు అర్జున్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య మరికొన్ని సంఘటనలు జరిగాయి. సంధ్య థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై దాదాపు గంటసేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని కొంతమంది ఖండిస్తే... మరికొంతమంది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు.
Read More News about Allu Arjun Arrest
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్
అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్‌పై ప్రశంసల జల్లు






