Allu Arjun: థియేటర్‌లో స్టాండింగ్ ఓవియేషన్.. ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన అల్లు అర్జున్‌ (వీడియో వైరల్)

by Kema Shiva Kumar |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 (Pushpa-2) మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది.

Allu Arjun: థియేటర్‌లో స్టాండింగ్ ఓవియేషన్.. ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన అల్లు అర్జున్‌ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 (Pushpa-2) మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షో (Benifit Shows)లు రన్ అవుతున్నాయి. తాజాగా, సినిమా చూసిన ఫ్యాన్స్ మూవీ సూపర్ హిట్ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులతో కలిసిన సినిమా చూసేందుకు ఫ్యామిలీతో అల్లు అర్జున్ (Allu Arjun) ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘జాతర’ సీన్‌లో ఐకాన్ స్టార్ నటన చూసి ఫ్యాన్స్ అంతా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది చూసిన బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనం విజయం సాధించాం అంటూ అభివాదం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. పుష్ప-2 విడుదల సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి అల్లు అర్జున్, వైల్డఫైర్ పుష్ప హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్‌‌లో ఏకధాటిగా ట్రెండింగ్ అవుతున్నాయి.

Next Story