‘ఇది మరపురాని ప్రయాణం’.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-05 06:13:37  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

‘ఇది మరపురాని ప్రయాణం’.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ  ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్
X

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రిలీజై సరిగ్గా నేటితో ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.

ఈ తరుణంలో అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇది తన కేరీర్‌లో మరపురాని ప్రయాణం అని పేర్కొన్నారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని ప్రేక్షకులతో పాటు అభిమానులు అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు సుకుమార్‌తో ఉన్న ఫొటోను బన్నీ షేర్ చేశారు. అల్లు అర్జున్ పోస్ట్ నెటిజన్లు విభిన్న రకాల కామెంట్లు పెడుతున్నారు. పోస్ట్ ఇదే

Next Story