రేవతి కుటుంబాన్ని కలిసి సాయం చేస్తా.. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ స్పందన (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-07 16:45:18  IST  )

పుష్ప-2(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మృతిచెండంపై ఆ చిత్ర హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్పందించారు.

రేవతి కుటుంబాన్ని కలిసి సాయం చేస్తా.. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ స్పందన (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మృతిచెండంపై ఆ చిత్ర హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం వీడియో విడుదలు చేశారు. ‘ఘటన గురించి విని షాక్ అయ్యాను. ఆ వార్తతో పుష్ప-2 సెలబ్రేషన్స్‌లో యాక్టీవ్‌గా పాల్గొనలేకపోయాం. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నాను. నా తరపున ఆమె కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తాను. మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను.’ అని అల్లు అర్జున్ ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హీరో అల్లు అర్జున్‌‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం, చిత్రబృందంపై కేసు నమోదయింది.

Next Story