- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో 'పుష్ప-2' రిలీజ్, ట్రైలర్ కూడా వచ్చేసింది
అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 జపాన్ లో కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ అయింది. వ

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సమయంలో పుష్ప రిలీజ్ కాగా, 2024 చివరలో పుష్ప 2 రిలీజ్ అయి బంపర్ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ మాత్రం అంతర్జాతీయ క్రికెటర్లు, సినిమా స్టారు కూడా చెబుతూ ఉంటారు.
అయితే, అలాంటి అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 జపాన్ లో కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ అయింది. వచ్చే సంవత్సరం జనవరి 16వ తేదీన జపాన్ లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటన చేసింది. ఇందులో భాగంగా జపనీస్ పోస్టర్ తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇది ఇలా ఉండగా పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేయగా రష్మిక హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా రూ.1800 కోట్లు వసూలు చేసింది.






