‘వావ్.. మైండ్ బ్లోయింగ్’.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-04 09:18:47  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఇంటర్నేషనల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నెవర్ బిఫోర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ‘పుష్ప 2’ రిలీజ్ అయి కూడా కొన్ని నెలలు దాటిపోగా.. ఆ ఊర మాస్ మ్యూజిక్, స్టెప్పుల నుంచి బయటకు రాలేకపోతున్నారు జనాలు.

‘వావ్.. మైండ్ బ్లోయింగ్’.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఇంటర్నేషనల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నెవర్ బిఫోర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ‘పుష్ప 2’ రిలీజ్ అయి కూడా కొన్ని నెలలు దాటిపోగా.. ఆ ఊర మాస్ మ్యూజిక్, స్టెప్పుల నుంచి బయటకు రాలేకపోతున్నారు జనాలు. ఈ క్రమంలోనే అమెరికా గాట్ టాలెంట్ షోలోనూ ఈ మూవీ సాంగ్ మారుమోగిపోయింది. ‘B Unique Crew’.. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక.. అంటూ స్టేజ్‌ను రఫ్పాడించింది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో 20వ సీజన్ నడుస్తుండగా.. జడ్జెస్ ఈ సీజన్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా కొనియాడారు. ఇది పుష్ప ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఘనతకు ఉదాహరణ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక దీనిపై స్పందించిన అల్లు అర్జున్ ‘వావ్.. మైండ్ బ్లోయింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.. ‘నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్’, ‘పుష్ప రూల్ ట్రూలీ రిమార్కబుల్’, ‘భాయ్ లెగసీ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను ఇన్‌స్పైర్ చేస్తుంది’, ‘పుష్ప గ్లోబల్ స్టార్మ్.. తగ్గేదేలే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లింక్

Next Story