- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసుతో ఆ హీరోకు సంబంధం లేదు.. లేడీ కొరియోగ్రాఫర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్

దిశ, వెబ్‌డెస్క్: లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ (Johnny Master) అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రెగ్యూలర్ బెయిల్ (Regular Bail)ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ (Johnny Master) అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందని.. ఆ కుట్రలో అల్లు అర్జున్ (Allu Arjun) ఉన్నాడంటూ అప్పట్లో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా ప్రచారం జరిగింది. తాజాగా, ఆ ప్రచారంపై కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) క్లారిటీ ఇచ్చారు. తన కేసు వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
తాను జానీ మాస్టర్ (Johnny Master)పై కక్షతో కేసు వేయలేదని.. తన ఆత్మాభిమానాన్ని దెబ్బదీశాడు కాబట్టే ధైర్యంగా బయటకు వచ్చానని అన్నారు. ఓ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వాడుకుని.. తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా అని ప్రశ్నించింది. లైంగిక వేధింపుల విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలబడిందని తెలిపారు. జానీ మాస్టర్ జాతీయ అవార్డు (National Award) రద్దు తనకు ఏమాత్రం సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. కేసు వాపస్ తీసుకొమ్మంటూ తనకు డబ్బు ఆఫర్ చేశారని.. కానీ ఆ ఆఫర్లకు తాను స్పందించ లేదని తెలిపారు. తాను ఎవరికీ భయపడే టైప్ కాదని శ్రష్టి వర్మ (Shrasti Verma) ఓ పాడ్‌కాస్ట్‌లో కామెంట్ చేశారు.