భార్యకు లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అర్జున్

by velandi.Saikiran |

తన తమ్ముడు శిరీష్ పెళ్లి కానుకగా అల్లు అర్జున్ ఒక ఖరీదైన లగ్జరీ కార్ ని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భార్యకు లగ్జరీ కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన అల్లు అర్జున్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తాజాగా తన సోదరుడు అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తన తమ్ముడు శిరీష్ పెళ్లి కానుకగా అల్లు అర్జున్ ఒక ఖరీదైన లగ్జరీ కార్ ని తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఉన్న ఘాడమైన అనుబంధానికి ఈ కానుక ఓ నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. కానీ ఈ కార్ ని అల్లు శిరీష్ పెళ్లి కానుకగా అల్లు అర్జున్ అందించలేదని..? అల్లు అర్జున్.. తన భార్య స్నేహ రెడ్డి పెళ్లి రోజు బహుమతిగా తన భార్య స్నేహ రెడ్డికి బహుమతిగా అందించాడని తాజా సమాచారం.

ఇందుకు సంబంధించి శుక్రవారం రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి ఈ కారుని బహుమతిగా అందించినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా బర్త్ డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వడం బన్నీకి అలవాటు. ఈ ఏడాది మ్యారేజ్ డే ఆయనకు మరి కాస్త స్పెషల్. దీంతో ఖరీదైన బహుమతిని తన భార్యామనికి అందించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ - స్నేహరెడ్డి వివాహ బంధానికి మార్చ్ 6 తో 15 సంవత్సరాలు. అల్లు అర్జున్ 2011లో స్నేహరెడ్డిని మార్చ్ 6 న వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య స్నేహరెడ్డికి విషెస్ చెబుతూ పోస్ట్ చేశాడు.

అలాగే ఇదే రోజున తన సోదరుడు శిరీష్ కూడా నైనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి రోజున అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏ.ఎం.జి మోడల్ కారుని బహుమతిగా అందించాడు. ప్రస్తుతం ఈ మోడల్ కారు ధర మార్కెట్లో 4 నుండి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ తోను ఓ మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. ఈ మూవీ కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Next Story