బోయపాటితో ఆ సీక్వెల్ నుంచి అల్లు అర్జున్ డ్రాప్ అయ్యాడా?

by Naga Rani Yarlagadda |

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన..

బోయపాటితో ఆ సీక్వెల్ నుంచి అల్లు అర్జున్ డ్రాప్ అయ్యాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇటు బన్నీ, అటు బోయపాటి వరుస సినిమాలను తీయడంలో బిజీ అయ్యారు. దీంతో సరైనోడు సీక్వెల్ పక్కనపడింది. ఎలాగైనా ఈ సినిమా సీక్వెల్ ను తీసుకురావాలని గీతా ఆర్ట్స్ బ్యానర్ తెగప్రయత్నిస్తోంది. దీంతో బన్నీ బోయపాటితో సీక్వెల్ గురించి ఆలోచనలో పడ్డారు.

రీసెంట్ గా బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన అఖండ-2 తాండవం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బన్నీ సరైనోడు సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఈ సీక్వెల్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదని తేటతెల్లమవుతుంది. ప్రస్తుతం బన్నీ.. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Next Story