- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ సినిమాకు బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 600 కోట్లు?
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయగా.. ఈ మూవీ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 600 కోట్లకు ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ ఫిక్స్ అయితే ఇండియన్ సినిమాలలో ఇదే అత్యధికం కానుందని తెలుస్తోంది.






