AA22: అల్లు అర్జున్ కొత్త మూవీ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్

by velandi.Saikiran |   (  Updated:2025-04-08 14:34:05  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. తాజాగా అల్లు అర్జున్ కొత్త సినిమా

AA22: అల్లు అర్జున్ కొత్త మూవీ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu arjun) అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. తాజాగా అల్లు అర్జున్ కొత్త సినిమా పైన బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే... తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ( Atlee Kumar ), అల్లు అర్జున్ హీరోగా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. AA22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన అనౌన్స్మెంట్ చేస్తూ ఓ అదిరిపోయే వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్రం బృందం. అల్లు అర్జున్ బర్త్ డే ఇవాళ ఉన్న నేపథ్యంలో... ఆయన చేయబోయే ఈ కొత్త సినిమా పైన అధికారిక ప్రకటన చేశారు. ఇక ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్ లో మెరిశాడు. రోబో మూవీ తరహాలో టెక్నాలజీని వాడుకుని ఈ మూవీ చేయనున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

ఇక అల్లు అర్జున్ కొత్త సినిమాను... సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. భారీ బడ్జెట్ పెట్టడంలో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ పేరుగాంచిన సంగతి తెలిసిందే. అటు అట్లీ కుమార్... 2023 సంవత్సరంలో జవాన్ సినిమాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఏకంగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో కోట్ల వర్షం కురిపించాడు అట్లీ. ఇక ఇటు అల్లు అర్జున్... పుష్ప 2 సినిమాతో... బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి సక్సెస్ కాంబో లో పాన్ ఇండియా సినిమా రానుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెను.. సంప్రదించినట్లు కూడా చెబుతున్నారు.

Next Story