అక్కినేని హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్.. కన్ఫార్మ్ చేసిన చిత్ర బృందం

by Chukka Sudharani |   (  Updated:2025-01-31 12:35:20  IST  )

అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya) మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘తండేల్’(Thandel). ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తుంది.

అక్కినేని హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్.. కన్ఫార్మ్ చేసిన చిత్ర బృందం
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya) మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘తండేల్’(Thandel). ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తుంది.అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు (Bunny Vasu)నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. దీంతో మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘తండేల్’ చిత్రం లవర్స్ డే(Lovers Day) స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ‘తండేల్’ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేస్తూ గెస్ట్ ఎవరో రివీల్ చేశారు. ‘తండేల్‌రాజ్ కోసం పుష్పరాజ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) వస్తున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌లో తండేల్ జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం ఉత్సాహంగా వేచి ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Next Story