- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Aravind : ఈడీ విచారణపై అల్లు అరవింద్ స్పందన
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) నేడు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) నేడు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం(Ramakrishna Bank Scam) కేసుకు సంబంధించి అరవింద్‌ను ఈడీ(Enforcement Directorate) అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. 2017లో ఒక మైనర్ వాటాదారునిగా ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశానని, ఆ ప్రాపర్టీపై ఈడీ కేసు ఉందని అన్నారు.
మైనర్ వాటాదారుడు ఆ ప్రాపర్టీపై బ్యాంకు రుణం తీసుకొని చెల్లించలేదని, సదరు ప్రాపర్టీ అకౌంట్ బుక్ లో తన పేరు ఉండటం వల్ల ఈడీ విచారణకు పిలిచిందని తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా విచారణకు హాజరయ్యి వివరాలు సమర్పించానని అల్లు అరవింద్ వెల్లడించారు. కాగా ఈ కేసులో ఈడీ అధికారులు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌కు ఆదేశాలు జారీ చేశారు.






