టాలీవుడ్ కోడలిగా మృణాల్ ఠాకూర్?.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-12 11:31:54  IST  )

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

టాలీవుడ్ కోడలిగా మృణాల్ ఠాకూర్?.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రతిభను కొనియాడుతూనే, ఆమె వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన సరదా కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మృణాల్ ఠాకూర్ నటనపై అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. "మృణాల్ చాలా గొప్ప నటి. తన నటనతో అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సీతారామం సినిమాతో తనేంటో నిరూపించుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది." అని ఆయన పేర్కొన్నారు.

మృణాల్‌కు దీవెనలు..

ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో నేను ఒక హీరోయిన్‌ను మనస్ఫూర్తిగా దీవించాను. ఆ తర్వాత ఆమె మా వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని మా ఇంటి కోడలైంది (లావణ్య త్రిపాఠి). ఇప్పుడు మృణాల్‌ను కూడా అలాగే దీవిస్తున్నాను. నువ్వు చక్కగా తెలుగు సినిమాలు చేస్తూనే, ఇక్కడే ఒక మంచి వాడిని చూసుకుని పెళ్లి చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని సరదాగా ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story