- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చేస్తున్న అల్లరోడు
ఢిపరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడు ముందుండే టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేశ్ తాజాగా తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు.

దిశ, సినిమా: ఢిపరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడు ముందుండే టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేశ్ తాజాగా తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ‘కనక దుర్గ’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా ఘనంగా నిర్వహించారు మేకర్స్. అత్యంత శక్తిమంతమైన కంటెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి, ప్రముఖ నిర్మాత స్వప్న దత్, అల్లరి నరేశ్ భార్య విరూప తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. అల్లరి నరేశ్ తన కెరీర్‌లో మరోసారి కొత్త కోణాన్ని చూపించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్ర యూనిట్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కథ, నటీనటులు, టెక్నికల్ టీమ్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.






