- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాల్లోకి రాకముందు అల్లరి నరేష్ అంత అల్లరోడా.. నటుడు.. దర్శకుడు ఇద్దరూ షాక్
పాత ఇంటర్వ్యూలో చలపతిరావు మాట్లాడుతూ... అల్లరి నరేష్ ఎందుకు పనికిరాడు అని నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ అనుకునేవారు, కానీ ఇప్పుడు ఆయన పెద్ద నటుడు అయ్యాడని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ తరం నటులలో అల్లరి నరేష్ ఒకరు. స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కుమారుడు నరేష్ 'అల్లరి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఆయన పేరు ముందు అల్లరి వచ్చేసింది. ఈ సినిమాకు సీనియర్ నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు దర్శకత్వం వహించాడు. ఒకానొక పాత ఇంటర్వ్యూలో భాగంగా చలపతిరావు, నరేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో చలపతిరావు మాట్లాడుతూ... ఈవీవీ సత్యనారాయణ గారిని ఎప్పుడు కలిసినా కూడా తన చిన్న కుమారుడు నరేష్ గురించి చాలా బాధపడుతూ ఉండేవాడు. అతను జీవితంలో ఎలా సెటిల్ అవుతాడో, నటన కూడా పెద్దగా వచ్చేలా లేదేమో, జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో ఇలా అనేక విషయాల్లో ఆయన బాధపడుతూ ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఒకరోజు రవిబాబు నేను ఒక సినిమా చేయబోతున్నాను అని చెప్పాడు. దానితో అందులో హీరో ఎవరు అని అడిగాను.
ఈవీవీ సత్యనారాయణ గారి రెండవ కుమారుడు నరేష్ అని చెప్పాడు. దానితో నేను షాక్ అయ్యాను. కానీ రవి బాబు మాత్రం ఆ పాత్రకు అతనే సెట్ అవుతాడు అన్నాడు. ఇక ఆ తర్వాత ఈవీవీ గారితో మా అబ్బాయి చేయబోయే సినిమాలో మీ నరేష్ హీరో అని చెప్పాను, ఆయన మొదట నవ్వుకొని జోక్ అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇలా అల్లరి నరేష్ ఎందుకు పనికిరాడు అనుకున్నాం, కానీ ఆయన పెద్ద నటుడయ్యాడు అని చలపతిరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.






