ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌కు ఆల్ సెట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-09-16 14:41:24  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌కు ఆల్ సెట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి ‘రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’, ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ ‘కల్కి-’తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ‘హ‌నుమాన్’తో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రజెంట్ ప్రభాస్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ పనులను కూడా పూర్తి చేశాడని టాక్.

ప్రతి సీన్‌, ప్రతి క్యారెక్టర్‌, ప్రతి షాట్‌ను ముందే డిజైన్ చేసిన ప్రశాంత్ వర్మ.. ప్రభాస్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మ రాక్షస్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. ప్రజెంట్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కించే పనిలో ఉండగా.. ప్రభాస్ ప్రాజెక్టులు కూడా పూర్తి అయిన తర్వాత ఇది బయటకు రానుంది. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ ప్రాజెక్టుపై 2026లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుండగా.. వీరిద్దరి కాంబోలో ఏ జానర్ వస్తుందో అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇది హోంబాలే ఫిలిమ్స్‌పై రూపొందబోతున్నట్లు టాక్. liNk

Next Story