- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్ట్ హీరో రోషన్ చేతిలో అన్ని సినిమాలు?
కోర్టు హీరో రోషన్ చేతిలో ప్రస్తుతం రెండు నుండి మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: యువ నటుడు రోషన్ ‘కోర్టు’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యువ హీరో, తాజాగా ‘బ్యాండ్ మేళం’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కోర్టు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి, ‘బ్యాండ్ మేళం’లో కూడా రోషన్‌కు జంటగా నటించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలోని రోషన్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ యువ నటుడికి వరుసగా కొత్త అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం రోషన్ రెండు నుంచి మూడు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు కూడా విజయవంతమైతే, తక్కువ సమయంలోనే రోషన్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి గాను రోషన్ దాదాపు రూ.33 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్లు సమాచారం.






