- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Alia Bhatt: అలియా.. ఇంత లేటుగా స్పందిస్తే ఎలా? నటి ఎమోషనల్ పోస్ట్‌పై విమర్శలు
భారత సైనికులు, వారి తల్లుల త్యాగం పట్ల నెట్టింట ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) తన గౌరవాన్ని చాటుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Indian soldiers) భారత సైనికులు, వారి తల్లుల త్యాగం పట్ల నెట్టింట ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషల్ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ధైర్యంగా పోరాడని సైనికులపై ప్రశంసలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, నిశ్శబ్దమే వినిపించిందని తెలిపారు. ప్రతి రోజు ఒక రకమైన టెన్షన్ ఉండేదన్నారు. ఆదివారం మనమంతా మదర్స్‌డే సంతోషంగా జరుపుకున్నాం. కానీ దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల త్యాగం మరువలేనిదని, వారి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు. ప్రతి సైనికుడి యూనిఫాం వెనుక నిద్ర లేని రాత్రులు గడిపే తల్లి ఉంటుందన్నారు. ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నామని, ఆ తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోందని కొనియాడారు.
పంటి బిగువున బాధను నొక్కిపెట్టిన మాతృమూర్తులకు ప్రతిక్షణం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మా రక్షకుల కోసం.. ఈ దేశం కోసం కలిసి నిలబడదాం.. జైహింద్ అంటూ నటి ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సిందూర్‌పై దేశమంత చర్చ జరుగుతుంటే ఆలియా.. ఇంత లేటుగా స్పందిస్తే ఎలా? అని పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.






