- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alia Bhatt: ఆ హీరోయిన్ భర్తను ఆరాధిస్తున్న అలియా.. ఆ పని చేయాలని ఉందంటూ తన కోరికను బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది ‘జిగ్రా’ (Jigra)చిత్రంతో హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం లవ్ అండ్ వార్(Love and War), అల్ఫా(Alpha) వంటి మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. అలియా భట్ షూటింట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని సందడి చేసింది. కలర్ ఫుల్ డ్రెస్‌లో అదరగొట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ తన కోరికను బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘‘నిజంగా ఫహాద్ నేను ఆరాధించే నటుల్లో ఒకరు. చాలా గొప్ప నటుడిగా భావిస్తాను. అతను నటించిన చిత్రాల్లో ‘ఆవేశం’ అంటే చాలా ఇష్టం. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషిస్తారు. ఆయన నటనలో ఏదో తెలియని శక్తి కనిపిస్తుంది. ఫహాద్ అద్భుతమైన నటడు. అతడితో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. మహమ్మారి నాకు నేర్పించిన ఒక విషయం ఏమిటంటే, మనం నిజానికి ఒక యూనిట్. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఆస్వాదిస్తున్నారు. మీరు ఏ రకమైన కంటెంట్‌నైనా చూడవచ్చు. అయితే నాకు రోషన్ మాథ్యూతో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. ఆయన చాలా అద్భుతమైన నటుడు. మలయాళంలో చాలా కంటెంట్ చేశారు.
ఆయన ఇప్పుడు హిందీలో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఫహాద్ మలయాళంలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తెలుగులో ‘పుష్ప’ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆయన భార్య కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. నజ్రీయా నజీమ్‌ను ఫహాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.






