అటెన్షన్ కోసమేనా? తోటి నటిపై అలియా భట్ తీరుపై నెటిజన్ల ఫైర్

by Sujitha Rachapalli |

బ్యూటిఫుల్ యామీ గౌతమ్ లేటెస్ట్ మూవీ ‘హక్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. షా బానో బేగం కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

అటెన్షన్ కోసమేనా? తోటి నటిపై అలియా భట్ తీరుపై నెటిజన్ల ఫైర్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యామీ గౌతమ్ లేటెస్ట్ మూవీ ‘హక్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. షా బానో బేగం కేసు ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 1985లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు, ముస్లిం మహిళలకు విడాకుల తర్వాత భరణం (మెయింటెనెన్స్) హక్కు గురించి చర్చించింది. ఇందులో యామీ షా బానోగా నటించడం కాదు జీవించిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా తోటి నటి యామీని కొనియాడింది. తన శక్తివంతమైన నటనను పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పింది. ఈ చిత్రం కోసం క్రాఫ్ట్ అండ్ హార్ట్ పూర్తిగా ఇచ్చేసిన నటిపై పొగడ్తల వర్షం కురిపించింది. అయితే అలియా భట్ ఇదంతా అటెన్షన్ కోసమే చేస్తుందని.. ‘ఆర్టికల్ 370’లో అద్భుతంగా నటించినప్పుడు ఎందుకు ప్రశంసించలేదని ప్రశ్నిస్తున్నారు.

Next Story